సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత చిన్న వయసులో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. అంతేకాదు చిన్న వయసులోనే వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంత ఛానెల్ ను ఏర్పాటుచేసింది. సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు విషయాలను షేర్ చేసుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది సితార. ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. చిన్న వయసులో సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. దీంతో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సితారను తన బ్రాండ్ అంబాసిడర్ గా ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు రోజుల పాటు యాడ్ షూట్ లో కూడా సితార పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బ్రాండ్ అంబాసిడర్ గా సితారకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందిస్తున్నారట. దీంతో అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా సితార నిలిచింది. ఇక ఈవిషయంపై మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తూ తండ్రి కి తగ్గ తనయురాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: