రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు కార్తీ పుట్టిన రోజు కావడంతో జపాన్ సినిమా కార్తీ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీ ఎంటర్ టైనర్ ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు ఇందులో కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ తో గోల్డ్ పళ్లతో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. సునీల్ కూడా మరోసారి డిఫరెంట్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇంట్రడక్షన్ వీడియో అయితే ఆకట్టుకుంటుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: