శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమాలో సముద్రఖని దివ్యాంగుడిగా నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్లు, టీజర్ అన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాాలో అనసూయ సుమతి అనే పాత్రలో నటిస్తుంది. రాహుల్ రామకృష్ణ కోటీ పాత్రలో, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్ ఇంకా డేనియల్ పాత్రలో ధనరాజ్ నటిస్తున్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఇంకా కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: