టాాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటి హీరోగా తేజ కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు రానా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. ఈసినిమాలో రానా జోగేంద్ర పాత్రలో నటించాడు. జోగేంద్ర పాత్రలో రానా అద్భతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈసినిమాకు రానా తో పాటు మరో ప్రధాన బలంగా నిలిచింది రానా భార్య పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ నటన. కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. రానా-కాజల్ మధ్య ప్రేమ, పొలిటిల్ వార్, సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సేమ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో జోగేంద్ర పాత్రకు మించిన పవర్ ఫుల్ రోల్‌ను తేజ సిద్దం చేశాడని అంటున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. టాప్ హీరో, దేవుడు, జంబ లకిడి పంబ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గోపీనాథ్ ఆచంట విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: