విజయ్ 68 ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్

vijay 68 movie first look release plan

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా విజయ్ 68 వ సినిమా కూడా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే కదా. విజయ్ తన తరువాత సినిమాను వెంకట్ ప్రభుతో చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను కన్ఫామ్ ఈసినిమాను రెండు రోజులు క్రితమే అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ లుక్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యూస్ ఒకటి వినిపిస్తుంది. అప్పుడే ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. జూన్ లో దళపతి పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఈ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిచనున్న ఈసినిమాను ఆగష్ట్ లో సెట్స్‌మీదకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =