ఈమధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన సంఘటనలు చూశాం. లెజెండరీ నటీనటుల దగ్గర నుండి ఎంతోమంది యంగ్ అండ్ సీనియర్ సెలబ్రిటీలు కన్నుమూాశారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశాడు. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు రాజ్. సంగీతం ద్వయం రాజ్ కోటి గురించి సినీ ప్రేక్షకులకు అలానే మ్యూజిక్ లవర్స్ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వారిలో రాజ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయిన తన నివాసంలో గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఇక రాజ్ మృతిపట్ల సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1954 జులై 27వ తేదీన జన్మించారు రాజ్. తండ్రి టీవీ రాజు వల్ల చిన్నప్పటినుండే సంగీతంపై రాజ్ కు కూడా ఆసక్తి ఉండేది. ఇక తండ్రి మరణానంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. అనంతరం సాలూరి రాజేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆరేళ్లు పనిచేశాడు. ఇక సాలూరి రాజేశ్వరరావు కొడుకే కోటీ. దాంతో ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఆ తరువాత సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేరారు. ఫైనల్ గా 1983 లో ప్రళయ గర్జన సినిమాతో ఇండస్ట్రీలోకి మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేశాడు రాజ్. ఆతరువాత కోటీ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు, శత్రువు లాంటి విజయవంతమైన చిత్రాలకు అందించారు.
ఆ తరువాత ఇద్దరూ విడపోవడం జరిగింది. రాజ్ ఒక్కడే చాలా సినిమాకు సంగీతం అందిచాడు. అంతేకాదు చాలా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు మొత్తంగా రాజ్ తన సినీ ప్రయాణంలో దాదాపు 450 కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు. ఇంకా పలు సినిమాల్లో నటుడిగా కూడా మెరిశారు. సంగీతం దర్శకుడిగా, నటుడిగా తెలుగు సినీ పరిశ్రమకు తన సేవలను అందించారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: