ఫస్ ప్లస్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టక్కర్ ట్రైలర్

siddharth takkar movie trailer report

హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఈమధ్యే మహా సముద్రం అంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమా జూన్ 9వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు అంటూ సిద్ధార్థ్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఇంకా సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. హీరో ను ఎంతగానో నమ్మిన హీరోయిన్ ను డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి హీరోకు ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? హీరోయిన్ ఆత్మహత్యాయత్నానికి కారణం హీరోనే కారణమా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సిద్ధార్థ్ హిట్ అందుకోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, టిజీ విశ్వప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 10 =