టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందారు. ఇంకా ఆవిషయం మరిచిపోకముందే అప్పుడే మరో ఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఆయన హైద్రాబాద్ ఏఐజీ హాస్పీటల్ లో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆయన చనిపోయాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. దానికి కుటుంబసభ్యులు సైతం స్పందించి అవి రూమర్లే.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇన్ని రోజులు చికిత్స తీసుకుంటున్నా పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు మృతిపట్ల సినీ ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శరత్ బాబు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన నటనా జీవితంలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, ఆపద్భాందవుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. శరత్ బాబు చివరిసారిగా తెలుగులో నటించిన సినిమా వకీల్ సాబ్. 5 దశాబ్దాల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించాాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: