కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మహా సముద్రం తరువాత తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా కూడా ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా ఎప్పటినుండో మొదలుపెట్టి టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ ను బట్టి ఈసినిమా ఒక పేదింటి యువకుడు..డబ్బున్న అమ్మాయి మధ్య జరిగే కథలాగా అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను నిజానికి మే 26 తేదీన రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.
#Takkar releasing in theatres worldwide on JUNE 9th.
Get to witness the world of modern Love & more about life !!
Starring #Siddharth
Directed by @Karthik_G_Krish#TakkarFromJune9@AAArtsOfficial @vishwaprasadtg@AbhishekOfficl @itsdivyanshak@vivekkuchibotla @MayankOfficl… pic.twitter.com/VakDTWEHSc— People Media Factory (@peoplemediafcy) May 19, 2023
ఇంకా ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, టిజీ విశ్వప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























