OG సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

pawan kalyan og movie second schedule begin

పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూట్ ను ప్రారంభించారు మేకర్స్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తరువాత పూణెలో కొన్ని రోజులు షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. నేటి నుండి హైద్రాబాద్ లో ఈసినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు మేకర్స్ తమ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =