సినిమాకు హైప్ రావాలంటే టీజర్,ట్రైలర్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.పర్ఫెక్ట్ టీజర్,ట్రైలర్ పడితే సినిమాకు మినిమిమ్ హైప్ గ్యారెంటీ అంతేకాదు సినిమా బిజినెస్ విషయంలోనూ ఈ రెండు కీలక పాత్రను పోషిస్తాయి.ఇక రీసెంట్ గా రెండు రోజుల వ్యవధిలో మూడు మీడియం రేంజ్ సినిమాలు టీజర్ లను వదిలాయి.ఈమూడు కూడా ప్రామిసింగ్ గా వున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ బోయపాటి మూవీ :
నిన్న రామ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టీజర్ ను వదిలారు.బోయపాటి మార్క్ యాక్షన్ ప్యాకడ్ గా కట్ చేసిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.రామ్ మేక్ ఓవర్,యాక్షన్ సీన్స్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.టీజర్ ఇచ్చిన హైప్ తో బాక్సాఫీస్ వద్ద ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమా పాన్ ఇండియా మూవీ గా అక్టోబర్ 20న విడుదలకానుంది.
ఆదికేశవ :
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం తన నాల్గువ సినిమా లో నటిస్తున్నాడు.నిన్న ఈసినిమా టైటిల్ తో పాటు గింప్స్ ను కూడా వదిలారు.ఈసినిమాకు ఆదికేశవ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా యాక్షన్ సీన్స్ తో వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది.కెరీర్ లో మొదటిసారి వైష్ణవ్ తేజ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు.శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈజూలై లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
స్పై :
కార్తికేయ 2 తరువాత యంగ్ హీరో నిఖిల్,స్పై తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు.కార్తికేయ 2 తెలుగు తోపాటు హిందీలోకూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో స్పైని తెలుగు తోపాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.నిన్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.సుభాష్ చంద్ర బోస్ గురించి తెలియని సీక్రెట్స్ ను దేశానికి తెలియజేయడం అన్న మెయిన్ పాయింట్ తో తెరక్కుతుంది ఈసినిమా.టీజర్ కూడా ప్రామిసింగ్ గా వుంది.ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ జూన్ 29న స్పై ప్రేక్షకులముందుకు రానుంది.
మరి ఈ మూడు సినిమాల టీజర్ లలో ఏ టీజర్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుందో వోట్ ద్వారా తెలియజేయండి👇
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: