ఏజెంట్ ఫ్లాప్ పై అఖిల్ ఎమోషనల్ పోస్ట్

akhil emotional reaction on agent movie

యంగ్ హీరో అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనిపై ఇప్పటికే చిత్రయూనిట్ స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా అఖిల్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పోస్ట్ లో ఏజెంట్ సినిమాకు ప్రాణం పోయడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన నటీనటులకు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మేము మా స్థాయిలో చాలా బాగా అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా మేము అనుకున్నట్టు తెరపై మెప్పించలేకపోయింది. మీ కోసం మేము మంచి సినిమాను అందించలేకపోయాము. నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాపై, మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్స్, మాకు సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. మీరిచ్చే ప్రేమ, శక్తి నన్ను ఇంకా పనిచేసేలా చేస్తున్నాయి. నన్ను నమ్మిన వారికోసం నేను మళ్ళీ బలంగా తిరిగివస్తాను అని తెలిపారు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నంటించాడు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించంగా.. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చాడు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా… ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =