నేతాజీగారి సీక్రెట్స్‌ ఈ స్పై కథ

tollywood young hero nikhil about spy movie

టాలీవుడ్ యంగ్ హీరో ప్రధాన పాత్రలో ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పై. యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌తో చెప్పేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మేకర్స్. ఈసందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. స్పై ఫస్ట్‌మిషన్‌ అని పెట్టడానికి కారణం మీడియాతో ఇంట్రాక్ట్‌ అవడం కోసమే. ఎన్ని హిట్లు వచ్చినా ప్రతి సినిమా కొత్త ప్రయత్నమే. స్పై మూవీ కి హీరో కథనే. ఈ మధ్య ప్రజలు ఇష్టపడేది మంచి కథనే. హీరో, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఎంత వున్నా కథ అనే సోల్‌ లేకపోతే బ్లాక్‌ బస్టర్‌ అవ్వదు. అలాంటి కథను రాజశేఖర్‌ రెడ్డి గారు ఇచ్చారు. మొదట కథ విని నో చెబుదాం అనుకున్నా. కానీ ఆయన చెప్పిన విధానం చూసి చేసేద్దాం అనిపించింది. సుభాష్‌చంద్రబోస్‌ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్‌ ఇందులో వుంది. నిన్న ఢిల్లీలో విడుదల చేసిన టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేతాజీగారి సీక్రెట్స్‌ ఈ కథ. తేజ్‌ నిర్మాత గా బాగా ఖర్చుపెట్టారు. ఇతర నటీనటులు అందరూ బాగా నటించారు అని అన్నారు.

సెన్సార్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాదని, ఈ సినిమా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కథ కాదని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ఎంతో మంది ఈ సినిమా కోసం పోటీపడిన సుభాష్ చంద్రబోస్ వంటి దేశ భక్తుడి కథ తో సినిమా చేయడం గౌరవంగా భావిస్తామని అన్నారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గురించి తెలియదు. అవన్నీ వెలికి తీశాం అన్నారు. సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కాదు. దేశ భక్తి కథ అని అన్నారు.

కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =