రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ తో బిజీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక తాజాగా చిత్రయూనిట్ చిరుకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇంద్ర సినిమా నుండి భోళా శంకర్ వరకూ ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే స్వాగ్ అదే గ్రేస్.. 22 సంవత్సరాలు అయినా కూడా సేమ్ స్వాగ్ అంటూ స్విట్జర్లాండ్ లో చిరు చిల్ అవుతున్న పిక్ ను పోస్ట్ చేశారు.
From #INDRA to #BholaaShankar🔱
Years may pass on, but the Mega SWAG & GRACE continues forever 🤟🏻MEGA 🌟@KChiruTweets chilling out & rocking in Switzerland🇨🇭with the same swag after 22 years ❤️🔥@MeherRamesh @tamannaahspeaks @dudlyraj @Sekharmasteroff @Akentsofficial pic.twitter.com/K1TvMbDq9S
— AK Entertainments (@AKentsOfficial) May 16, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: