మై డియర్ ఫ్యాన్స్ RAPO20 లో ఇంకా చాలా ఉంది

ram pothineni reaction on rapo 20 first thunder glimpse

బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో రాపో20 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక దసరాకు విడుదల చేయబోతున్నట్టు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈసినిమా షూటింగ్ ను జరుపుతూనే మరోపక్క అప్ డేట్లను కూడా ఇస్తున్నారు. తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. బోయపాటి ఫస్ట్ థండర్ అనే పేరుతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవీడియో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రామ్ పోతినేని మాస్ అవతార్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ ఈ గ్లింప్స్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సందర్భంగా రామ్ తనకు బర్త్ డే విషెస్ తెలిపినందుకు.. తన గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ కు పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తూ ధన్యవాదాలు తెలియచేశాడు. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ఇండస్ట్రీలోని నా తోటీ నటీనటులు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నా డియరెస్ట్ ఫ్యాన్స్.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఎప్పటిలాగే నాకు మీ ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరూ గ్లింప్స్‌ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. మీకు ఇంకా చూడబోయేది సినిమాలో చాలా ఉంది. ప్రేమతో మీ రాపో అని పోస్ట్ లో తెలిపాడు.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =