సోషల్ మీడియా సినీ సెలబ్రిటీలకు వారి సినిమాలను ప్రమోషన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో అదే సోషల్ మీడియా వల్ల వారి తలనొప్పి తెప్పించే వార్తలు కూాడా ప్రచారమవుతుంటాయి. ఎన్నో తప్పుడు వార్తలు వైరలు అవుతుంటాయి. దురదృష్టకరం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలపై ఏకంగా చనిపోయారంటూ కథనాలు కూడా వస్తుంటాయి. ఆమధ్య లెజెండరీ నటుడు కోటా శ్రీనివాస్ రావు సైతం తను చనిపోలేదంటూ తప్పుడు వార్తలు రాయద్దు అంటూ వీడియో పెట్టి మరీ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్ నటుడిపై కూడా అలాంటి వార్తలే మొదలయ్యాయి. ఆ సీనియర్ శరత్ బాబు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శరత్ బాబు ఇటీవల కాస్త అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన చనిపోయాడంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో ఆయన సోదరి ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి.. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది.. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అంటూ తెలిపింది. మరోవైపు శరత్ బాబు సోదరుడి కొడుకు ఆయుష్ తేజన్ కూడా ఈవార్తలపై స్పందిస్తూ.. శరత్ బాబు గారి ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని.. డాక్టర్స్ కోలుకోవడానికి కాస్త టైమ్ పడుతుందని చెప్పారు.. ఈలోపు ఎలాంటి రూమర్స్ ను నమ్మద్దు అంటూ తెలిపాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: