మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా సెకండ్ పార్ట్ కూడా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాాది ఈసినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ్ రికార్డ్ కలెక్షన్స్ ను సైతం రాబట్టుకుంది. దాంతో సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ గా ఉందని.. కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉందన్న గుడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమాకు బలం చేకూరింది. దాని ప్రభావం కలెక్షన్స్ పై కూడా పడింది. ఈసినిమా రిలీజ్ అయి కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుంది. కానీ రెండు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమాకు ఎంత ఆదరణ లభిస్తుందో. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Conquering hearts and box office alike! #PS2 garners over a 100 crore collection worldwide#PS2RunningSuccessfully #CholasAreBack#PS2 #PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN… pic.twitter.com/M2xcZNXzNZ
— Lyca Productions (@LycaProductions) April 30, 2023
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ.. రవి వర్మన్, ఎడిటర్.. ఎ. శ్రీకర్ ప్రసాద్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: