బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.ఈకాంబినేషన్ కు సూపర్ హైప్ వుంది.ఈసినిమా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.అయితే రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.కానీ ఈవార్తల్లో నిజం లేదని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన తేదీకే ఈఏడాది జూన్ 2 న జవాన్ విడుదలకానుంది సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టనున్నారు.అందులో భాగంగా మే మొదటి వారం లో టీజర్ ను వదలనున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి,సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనె అతిధి పాత్రలో మెరవనుంది.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.షారుక్ స్వంత ప్రొడక్షన్.. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఇక షారుక్ ఇటీవలే పఠాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.జనవరిలో విడుదలైన ఈసినిమా 1000కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ హిట్ గా నిలిచింది. ఇక షారుక్ ప్రస్తుతం డుంకి అనే సినిమాలో నటిస్తున్నాడు.రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జజరుపుకుంటున్న ఈసినిమా క్రిస్మస్ కి థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: