ఏజెంట్ ట్రైలర్ ఇంప్రెసివ్- సూపర్ స్టార్ రియాక్షన్

super star mahesh babu reaction on agent trailer

ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, అఖిల్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అఖిల్ మేకోవర్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. తన బాడీని పూర్తిగా మార్చేశాడు ఈసినిమా కోసం. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తుందన్న నమ్మకంతో ఉండగా.. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ తో ఆ నమ్మకం మరింత ఎక్కువైంది. అంతేకాదు ట్రైలర్ పై టాలీవుడ్ హీరోలు కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే అఖిల్ అన్న నాగ చైతన్య, టాలెండెట్ హీరో అడివి శేష్ ఇంకా సాయి ధరమ్ తేజ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా ఏజెంట్ ట్రైలర్ పై స్పందించారు. ఏజెంట్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది.. అఖిల్ ట్రాన్ఫమేషన్ స్టన్నింగ్ .. ముఖ్యంగా అనిల్ సుంకర గారు ఈసినిమాను ఇంత గ్రాండ్ లెవల్ లో తెరకెక్కించారు.. చిత్రయూనిట్ కు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =