కీర్తి సురేష్ కూడా ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ కెరిర్ లో దూసుకుపోతుంది. సర్కారు వారి పాట సినిమాలో అప్పటివరకూ చేయని ఎనర్జిటిక్ పాత్రలో చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు దసరాతో తనలో మరో యాంగిల్ ను చూపించింది. రీసెంట్ దసరా సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది కీర్తి సురేష్. ఈసినిమాలో వెన్నెల అనే పాత్రలో మాస్ పాత్రలో చెలరేగిపోయింది. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో తాజాగా తను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈనేపథ్యంలో అభిమానులు కీర్తి సురేష్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఓ నెటిజన్ సమంత గురించి చెప్పమని అడుగగా.. నేను స్పూర్తి పొందే వారిలో సమంత కూడా ఉంటుంది.. నేను చూసిన వారిలో చాలా స్ట్రాంగ్ హార్ట్ ఉన్న వారిలో సామ్ కూడా ఒకరు.. సింపుల్ గా చెప్పాలంటే అన్ స్టాపబుల్ అంటూ ప్రశంసించింది. ఇక కీర్తి సురేష్ ఆన్సర్ పై సామ్ కూడా స్పందిస్తూ థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై ఇచ్చింది.
వీరిద్దరూ కలిసి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. సమంత స్టార్ హీరోయిన్ అయినా కూడా ఈసినిమాలో నటించడానికి ఏమాత్రం సందేహించకుండా నటించింది. లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటించగా.. కథను ముందుకు నడిపే పాత్రలో సమంత నటించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: