రెండు పార్టులు గానే సలార్

prabhas salaar movie to release in two parts

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు. దానికి తోడు ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. అందుకే ప్రేక్షకులు కూడా ఈసినిమా కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందంటూ ఎప్పుడో వార్తలు తెరపైకి వచ్చాయి. వాటిపై ఇప్పటివరకూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈసినిమాలో నటించిన కన్నడ నటుడు దేవరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సలార్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. మొదటి భాగంలో కంటే రెండో పార్ట్‌లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు. దీంతో ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. సలార్ లో ప్రభాస్‌ రెండు పాత్రలు చేస్తున్నాడని.. అందులో ఒకటి నెగిటివ్‌ షేడ్ ఉన్న పాత్ర.. పవర్‌‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. చూద్దాం దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో..

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.