ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

muttiah muralitharan biopic movie 800 first look poster release

కొన్నాళ్లు బయోపిక్ ల హవా నడిచిన సంగతి తెలిసిందే కదా. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. ఈనేపథ్యంలో సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా వస్తుంది. ఈసినిమా 800 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ఈసినిమాలో ముందుగా తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మధుర్ మిట్టల్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే చాలా రోజుల నుండి ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇన్ని రోజుల తరువాత ఈ సినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకా ఈసినిమాను తమిళ్, తెలుగు ఇంకా హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఎమ్ఎస్ శ్రీపతి దర్శకత్వంలో వహిస్తున్న ఈసినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పై వివేక రంగాచారి నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ముత్తయ్య మురళీధర్. 1992 నుండి 2011 మధ్య శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1996లో తమ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 133 టెస్టుల్లో అత్యధిక వికెట్లు (800) తీసిన ఆటగాడిగా మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నాడు. 2011లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు. అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =