దసరా పై చిరు కామెంట్

Megastar Chiranjeevi Is All Praises for Dasara Movie

నాని నటించిన దసరా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈసినిమాతో నాని బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తాజాగా సినిమాను చూసిన చిరు, దసరా టీం పై ప్రశంసలు కురిపించారు.డియర్ నాని, కంగ్రాట్స్.. దసరా చూశాను. బ్రిలియెంట్ మూవీ.నాని మేక్ ఓవర్,పెరఫార్మెన్స్ అదుర్స్. ఇది శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఇంత అద్భుతంగా తీసినందుకు తనను అభినందిస్తన్నా. మహానటి కీర్తి సురేష్.. వావ్ అలాగే దీక్షిత్ శెట్టి  అద్భుతంగా చేసాడు.సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సూపర్.. దసరా టీం కు నా అభినందనలు అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఇదిలావుంటే మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా దసరా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. రెండువారాల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 111కోట్లగ్రాస్ వసూళ్లను రాబట్టగా ఇందులో షేర్ 61కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో 71కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ముఖ్యంగా నైజాం లో ఈసినిమా అద్భుతమైన  వసూళ్లను సొంతం చేసుకుంది. నిన్నటి తో అక్కడ 25కోట్ల షేర్ ను క్రాస్ చేసింది దాంతో  నైజాంలో అత్యధిక షేర్ ను రాబట్టిన సినిమాల జాబితాలో దసరా స్థానం దక్కించుకుంది.ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈసినిమాను  నిర్మించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.