సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. ఈసినిమాతో ఎలాగైనా భారీ హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అంతేకాదు ఈసినిమాకోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎలాగైనా సంక్రాంతి రేసులో దించాలనుకున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు కాబట్టి అది కూడా కుదరలేదు.ఫైనల్ గా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తుండగా.. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దీనిలో భాగంగానే తాజాగా రామ కృష్ణ అనే పాట ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్రేకప్ సాంగ్ లాగ ఉన్న ఈపాట కు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల పాడారు. ఇక ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: