పుష్ప 2 -మ్యూజికల్ సర్ ప్రైజెస్ చాలా ఉన్నాాయి

devi sri prasad response on o antava mava song reprise in pushpa 2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా బన్నీ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా రాగా.. మొదటి ప్రయత్నలోనే తన సత్తాను దేశవ్యాప్తంగా చాటాడు. దాదాపు ఏడాదికి పైగా ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కొనసాగింది. బన్నీ రా రస్టింగ్ అవతారంలో కనిపించడం.. దానికి తగ్గట్టుగా సుకుమార్ కథ, బన్నీ నటన, యాసలో చెప్పే డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ సినిమా విజయానికి బలమయ్యాయి. సౌత్ ఏ రేంజ్ లో హిట్ అయిందో నార్త్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సెకండ్ పార్ట్ కోసం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే పుష్ప 2 నుండి బన్నీ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆ వీడియో ఇంకా ఫస్ట్ లుక్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ ట్రెడింగ్ లో దూసుకుపోతుంది. దీంతో అప్పుడే పుష్ప రూలింగ్ మొదలైందని ఫ్యాన్స్ హ్యాపీలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో అన్ని సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే కదా.. అయితే వాటిలో స్పెషల్ సాంగ్ గా వచ్చిన ఊ అంటావా మావ ఉఊ అంటావా మామ సాంగ్ మాత్రం స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. స్టార్ హీరోయన్ సమంత ఈ పాటలో నటించడంతో ఆపాట మరింత హైలెట్ అయింది. ఇక ఇప్పుడు పార్ట్2 వస్తుంది.. పార్ట్ లో కూడా ఇలాంటి పాట ఉంటుందేమో అని అందరూ ఇప్పటినుండే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే దీనిపై సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ అయితే ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ ను పార్ట్ 1 లోి ఊ అంటావా మామ ఉఊ అంటావా మామ లాంటి పాటను మళ్లీ తీస్తారా అని అడుగగా.. దానికి దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ అయితే ఏం లేవు కానీ నేను, సుకుమార్ మాత్రం ఫ్యాన్స్ కు చాలా మ్యూజికల్ సర్ ప్రైజెస్ తో రాబోతున్నాం అని తెలిపాడు. ఆ సర్ ప్రైజెస్ ఏంటో మాత్రం చెప్పకుండా సర్ ప్రైజ్ గానే ఉంచాడు..

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి మొదటి పార్ట్ తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eighteen =