కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి తన మార్క్ కామెడితో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఇక కమెడియన్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అందాల రాముడు సినిమాలో హీరోగా చేసి హీరోగా కూడా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి లాంటి దర్శకుడితో మర్యాద రామన్న చేసి ఆ సినిమాతో హిట్ అవ్వడంతో సునీల్ రేంజ్ మారిపోయింది. కానీ ఆతరువాత చేసిన సినిమాలు మాత్రం సునీల్ కు విజయాలను అందించలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ కమెడియన్ గా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అంతేకాదు తనలో ఉన్న పలు యాంగిల్స్ ను చూపించడానికి ఇప్పుడు ఏమాత్రం వెనుకాడట్లేదు. అందుకే నెగెటివ్ షేడ్స్ లో నటించేస్తున్నాడు. పుష్ప తరువాత వేరే ఇండస్ట్రీల నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సునీల్ కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు భువన విజయమ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ ఆఫ్ భువన విజయమ్ అనే పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సునీల్ ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈవీడియోలో హేయ్ నారాయణా.. ఆరు నెలలుగా కథలు వింటున్నాం. అన్నీ అవే రెగ్యులర్ కథలు.. వినీ వినీ బాగా బోర్ కొట్టేసింది. మంచి కథ ఉంటే చూడు. కొత్త సినిమా సైన్ చేద్దాం.. చాలా కొత్తగా ఉండాలబ్బాయి అంటున్నాడు సునీల్. మరి ప్రీతమ్ కుమార్ సినిమా చేశాడా..? లేదా..? అన్నది సస్పెన్స్
కాగా ఈసినిమాలో ఇంకా పృథ్విరాజ్, గోపరాజు రమణ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనురాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: