కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ విడుతలై : పార్ట్ 1,మార్చి31న విడుదలై పాజిటివ్ టాక్ తో విజయం దిశగా దూసుకుపోతుంది.కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి,గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.ఇళయరాజ సంగీతం అందించారు.ఈక్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు విడుదల:పార్ట్ 1పేరుతో తెలుగులో విడుదలకానుంది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలచేస్తున్నాడు.ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వెట్రిమారన్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు హీరోలతో సినిమాల గురించి వెట్రిమారన్ స్పందిస్తూ…ఆడుకాలం తరువాత అల్లు అర్జున్ ను రెండు సార్లు కలిశాను అప్పుడు వడ చెన్నై లో పవర్ ఫుల్ రోల్ గురించి చెప్పాను.కానీ ఆతరువాత స్క్రిప్ట్ నుండి ఆ రోల్ ను తీసేయాల్సివచ్చింది దాంతో అల్లు అర్జున్ తో సినిమా చేయలేకపోయాను.ఆతరువాత మహేష్ బాబు ను కలిశాను కానీ ఆయనతో కూడా సినిమా వర్క్ అవుట్ కాలేదు.
ఇక లాక్ డౌన్ తరువాత ఎన్టీఆర్ ను కూడా కలిశాను. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే సినిమా చేయడానికి మాత్రం చాలా టైం పట్టొచ్చు అని వెట్రి మారన్ అన్నాడు.గత కొంత కాలంగా ఎన్టీఆర్,వెట్రిమారన్ కలిసి సినిమా చేయనున్నారని వార్తలు వస్తూనే వున్నాయి.అయితే తాజాగా వెట్రిమారన్,ఎన్టీఆర్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.ఎన్టీఆర్ 30,వార్ 2,ప్రశాంత్ నీల్ తో సినిమాల తరువాత ఎన్టీఆర్,వెట్రిమారన్ తో సినిమా చేసే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: