మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మణిరత్నంకు సూపర్ హిట్ ను అందించింది. చోళులు కాలం నాటి కథను తీసుకొని దానిని విజువల్ వండర్ గా చూపించాడు మణిరత్నం. అందుకే ఈసినిమా అందరినీ ఆకట్టుకొని హిట్ ను అందుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ప్రస్తుతం పార్ట్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను 4డీఎక్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక 4డీఎక్స్ లో రిలీజ్ అవుతున్న మొదటి సౌత్ ఇండియన్ సినిమా అని కూడా తెలిపారు.
#PS2 will be the 1st South Indian Movie to release in #4DX 🤩 Watch it in your nearest #4DXCinemas 📽️ to have a wholesome experience of the world of #PonniyinSelvan ⚔️#PS2 in cinemas worldwide from 28th April in Tamil, Hindi, Telugu, Malayalam, and Kannada!#CholasAreBack… pic.twitter.com/I3NwsD4SGH
— Lyca Productions (@LycaProductions) April 11, 2023
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: