సపోర్టింగ్ రోల్స్ నుండి హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని ప్రస్తుతం చిన్న సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నాడు సుహాస్. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటించి తన మార్క్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారాడు. ఆసినిమా హిట్ అయింది. తరువాత ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ మూడో ప్రాజెక్ట్ ను కూడా మొదలుపెట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఇక తన ప్రతి సినిమాకు డిఫరెంట్ టైటిల్స్ తో వస్తున్న సుహాస్ ఈసినిమాకు కూడా డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ఈసినిమాకు అంబాజీపేట మ్యారేజి బ్యాండు అంటే టైటిల్ ను ఖరారు చేశారు. ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది.. ఇంక బ్యాండ్ మోగిపోతుంది అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: