కొంతమంది నటీనటులకు ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అలా తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చిందో లేదో సూపర్ క్రేజ్ తెచ్చుకొని బిజీ హీరోయిన్ అయిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో సీతారామం అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక ఈసినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా.. ఈసినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. పీరియాడికల్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాలను ఆకర్షించి మంచి ప్రజాదారణ పొందింది. ముఖ్యంగా సీత పాత్రలో నటించిన మృణాల్ కు మాత్రం అందరినుండి ప్రశంసలు దక్కాయి. దీనిలో భాగంగానే ఓసీతా అనే పాట ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా సీక్వెల్ పై అప్పట్లో పలు వార్తలు వచ్చినా వాటిపై అయితే క్లారిటీ లేదు. అయితే ఆమధ్య డైరెక్టర్ హను రాఘవపూడి కూడా మాట్లాడుతూ తనకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని తెలిపాడు ఇక ఇప్పుడు దీనిపై మృణాల్ ఠాకూర్ కూడా స్పందిస్తూ సీతారామం2 కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలపింది. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించినా మృణాల్ ను ఓ అభిమాని సీతారామం సీక్వెల్ ఉంటుందా అని అడుగగా దానికి మృణాల్.. నేను సీతారామం షూటింగ్ రోజులను ఎప్పుడూ మరిచిపోను.. అయితే సీక్వెల్ గురించి పెద్దగా తెలియదు కానీ నేను కూడా సీతారామం 2 గురించి చాలా వెయిట్ చేస్తున్నా అని తెలిపింది మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా సీతారామం తరువాత మృణాల్ వెంటనే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తన 30వ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























