నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఈసినిమాలో మూడు పాత్రలో నటించాడు.. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎంత సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ లో ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను వెంటనే మొదలుపెట్టి ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఇది వరకెప్పుడూ చేయని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: