మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర విడుదలకు సిద్దమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదలైంది. ఇక ఈట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈచిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తుంటే లాయర్ గెటప్ లో కమెడియన్ హైపర్ ఆది తో కలిసి రవితేజ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడు. అలాగే రవితేజ మరో షేడ్ లో కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ డైలాగ్స్ కూడా బాగున్నాయి.మొత్తానికి ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ , రవితేజ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్ , రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ ,దక్ష నాగర్కర్ , మేఘా ఆకాష్ ,పూజిత పొన్నాడ, ఫారియా అబ్దుల్లా హీరోయిన్లు గా నటిస్తుండగా రావు రమేష్ , జయరాం , మురళి శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈసినిమా విడుదలకానుంది.
ఇక వరుసగా ధమాకా , వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకొని సూపర్ ఫామ్ లో వున్న రవితేజకి రావణాసుర హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























