సుప్రీమ్ హీరో సాయి తేజ్ కూడా ఇప్పుడు తన రూట్ మార్చి విభిన్నమైన కథలను చేయడానికి ముందుకొస్తున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి తేజ్ కు ఈసినిమా మంచి హిట్ నే అందించే అవకాశం ఉందన్న నమ్మకం ఏర్పడింది. అంతేకాదు పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఒక ఫజిల్ ను ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా వరల్డ్ ఆఫ్ విరూపాక్ష అంటూ రెండు నిమిషాల ఒక సెకను నిడివి కలిగి ఉన్న వీడియోను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుంది. రుద్రవనంలోని మోదమాంబా టెంపుల్ కి సంబంధించిన సెట్స్ ను వీడియోలో చూపించడం జరిగింది. ఈవీడియోతో సినిమా కోసం సాంకేతిక నిపుణులు ఎంతగా కష్టపడ్డారు అనేది వీడియోను చూస్తే అర్థం అవుతుంది. మరి ఫస్ట్ వాల్యూమ్ అంటున్నారు.. ఈసినిమా కూడా రెండు పార్ట్ లుగా ఉండబోతుందా అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Here’s “Modhamamba Temple” – The 1st Volume from the Intriguing Short Series #IntoTheWorldOfVirupaksha ⛩️💥
– https://t.co/FbmqcHUi8R@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86@BvsnP @aryasukku @bkrsatish @SVCCofficial @SukumarWritings#Virupaksha #VirupakshaOnApril21st pic.twitter.com/vO1M9UfFbv
— SVCC (@SVCCofficial) March 20, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: