వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. భోళా శంకర్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భోళా శంకర్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందనీ , ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి , డ్యాన్సర్ మలైకా అరోరా నటించనుందనీ , ఈ సాంగ్ షూట్ కోసం ఓ ప్రత్యేక సెట్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం . పలు సూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ మలైకా అరోరా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అతిథి , గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో మలైకా తెలుగు ప్రేక్షకులను అలరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































