ఉగ్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ రిలీజ్

deveri song out from allari naresh ugram movie

నాంది సినిమా తరువాత అల్లరి నరేష్ తన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఉగ్రం. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు నాంది తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. దేవేరి గుండెల్లో చేరి.. మదిలో మోగిందే సరిగమ సావేరి అంటూ ఫీల్ గుడ్‌ ఇంప్రెస్‌తో సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 13 =