చిరంజీవితో బాండింగ్ పై కలెక్షన్ కింగ్ కామెంట్స్

Collection King Mohan Babu Interesting Comments About Bonding With Chiranjeevi

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందనేది అందరూ అనుకుంటూనే ఉంటారు. వారిద్దరూ మాములుగా మాట్లాడుకున్నా సరే ఏదో ఒక చర్చ నడుస్తుంటూనే ఉంటుంది. అంతేకాదు పలుమార్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేమిద్దరం స్నేహితులం అని చెప్పడానికి ఫొటోలు ఇంకా సంభాషణల ద్వారా చూపించినా కూడా ఇంకా ఎక్కడో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న అభిప్రాయంతోనే చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా ఎన్నికల సమయంలో చిరంజీవికి, మీకు మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు అందరూ అనుకున్నారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది చర్చించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మేమిద్దరం ఎన్నో వందలసార్లు ఎదురుపడ్డాం. మంచి చెడ్డా, మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు. బయటవాళ్లు అనుకోవడం మాత్రమే అని అన్నారు. ఇంకా వజ్రోత్సవ వేడుకల సమయంలో జరిగిన సంఘటన గురించి కూడా చెబుతూ.. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనవసరం.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయి. భారత, రామాయణం చూసాం. కాబట్టి అది నథింగ్ అని తెలిపారు. మరి మోహన్ బాబు ఇచ్చిన క్లారిటీతో ఇప్పటికైనా వారిద్దరి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదన్నది ప్రజలు నమ్ముతారేమో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.