రావణాసుర లో నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది

daksha nagarkar about her role in ravanasura movie

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నాగర్కర్ విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
రావణాసుర కోసం నిర్మాత అప్రోచ్ అయ్యారు. మొదట ఇందులో పాత్ర లుక్ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రావణాసురలో మీ పాత్ర ఎలా వుంటుంది ? నటనకు ఆస్కారం వుండే పాత్రేనా ?
రావణాసురలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్రస్తుతానికి అది సస్పెన్స్. నటన విషయానికి వస్తే.. పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ వుండే పాత్ర చేశాను.

క్రైమ్ థ్రిల్లర్ చేయడం మీకు కొత్త కదా ? ఎలా అనిపించింది ?
నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్ డిస్టర్బ్ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్. రావణాసుర కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు.

దర్శకుడు సుధీర్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?
సుధీర్ వర్మ గారి గత చిత్రాలు చూశాను. చాలా డిఫరెంట్ గా వుంటాయి. రావణాసుర కథని కలర్ పేలేట్ తో సహా ఎలా వుంటుందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

ఇందులో చాలా మంది హీరోయిన్స్ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధన్యత వుంటుందో అనే సందేహం రాలేదా ?
నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ద్రుష్టిపెట్టాను. నా పాత్రతోనే ఇన్వాల్వ్ అయ్యాను.

రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ?
రవితేజ గారు బిగ్ స్టార్, మాస్ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్ గా వుంటారు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం.

రావణాసుర బలాలు ఏమిటి ?
రవితేజ గారు, దర్శకుడు సుధీర్ వర్మ, సుశాంత్, డీవోపీ, మా టెక్నికల్ టీం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్ ఇచ్చాం.

సుశాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుశాంత్ గారు చాలా సరదా మనిషి. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు.

ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. చాలా నేర్చుకోవాలి. ఇటివలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంది.

కొత్తగా చేయబోతున్నా ప్రాజెక్ట్స్ ?
రెండు సినిమాలు సైన్ చేశాను. వివరాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =