టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృషవంశీ అని టక్కున చెప్పేస్తాం. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియంటెడ్ ….ఇలా అన్ని రన్నింగ్ జోనర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ తీసిన అరుదైన ఘనత కృష్ణవంశీ కి దక్కుతుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు కృష్ణవంశీ. ఇప్పటికే పలు పోస్టర్స్, టీజర్, షాయరీ, సాంగ్స్ రిలీజ్ అవ్వగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈసినిమా కృష్ణవంశీకి మంచి విజయాన్ని అందిస్తుందన్న ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీమియర్ షోని నిర్వహించారు కృష్ణవంశీ. హైద్రాబాద్ లో ప్రీమియర్ షోని ఏర్పాటు చేయగా పలువురు డైరెక్టర్లు, సినీ ప్రముఖులు చూశారు. ఇక అనంతరం పలువురు మాట్లాడుతూ.. రంగమార్తాండ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని.. ఇందులో ఆకట్టుకునే కథ, కథనాలు, పాత్రలు హృద్యమైన ఎమోషనన్స్ మన మదిని తాకుతాయని అంటున్నారు. దీంతో రంగమార్తాండ ప్రీమియర్ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: