ఎంతోకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ సినిమా మాత్రం పెద్ద ఊరటని ఇచ్చింది అని చెప్పొచ్చు. కరోనా వల్ల రెండేళ్లు అన్ని ఇండస్ట్రీలకు పెద్ద నష్టమే కలిగింది. అయితే ఆ తరువాత అన్ని ఇండస్ట్రీలు కాస్త కోలుకున్నాయి ఒక్క బాలీవుడ్ తప్పా. అసలే సరైన హిట్ లు లేక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరోపక్క ఆమధ్య రిలీజ్ అయిన చాలా సినిమాలపై ఏదో ఒక అభ్యంతరం చెబుతూ బాయ్ కట్ వివాదాలు తెరపైకి తెచ్చారు. ఇక పఠాన్ సినిమాకు కూడా రిలీజ్ కు ముందు చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఈసినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. దీంతో ఈసినిమా రిజల్ట్ పై కూడా చాలా అనుమానాలు తలెత్తాయి. కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ పఠాన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి మళ్లీ బాలీవుడ్ కు మళ్లీ పూర్వ అనుభవం అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఫుల్ యాన్ ఎంటర్ టైనర్ పఠాన్. జనవరి 25 వ తేదీన పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. షారుఖ్ ఖాన్ వన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి-2 రికార్డును కూడా క్రాస్ చేసిన ఈసినిమా ఇప్పటికీ పలు థియేటర్ లలో రన్నింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు.ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా మార్చి 25వ తేదీ నుండి స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా.. జాన్ అబ్రహాం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. సినిమాటోగ్రఫీ సంచిత్ పౌలోస్, సంగీతం సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: