స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినా ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ నుంచి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు . అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా.. అభిమానులు, రిపోర్టర్లూ… తారక్‌ను ఎయిర్‌పోర్టులో కలిశారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డును స్వీకరించడం బెస్ట్ మూమెంట్ అనీ , .తాను ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి చాలా గర్వంగా భావిస్తున్నాననీ , ఆర్‌ఆర్‌ఆర్‌ని ప్రోత్సహించినందుకు ప్రతి భారతీయుడికీ తాను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాననీ , మేము గెలుచుకున్న ఈ ఆస్కార్ అవార్డు ప్రేక్షకుల ప్రేమ, చిత్ర పరిశ్రమతో మాత్రమే సాధ్యమైందనీ ఎన్టీఆర్ చెప్పారు.
Man of Masses #JrNTR First reaction with media after Naatu Naatu song won at #Oscars !!💥💥@tarak9999 #NaatuNaatuWinsOscars #Oscars95 #RRRMovie #TeluguFilmNagar pic.twitter.com/AzRoEouh1m
— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.