మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి తేజ్ ఇప్పుడు తను కూడా తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. 2021లో రిపబ్లిక్ సినిమాతో వచ్చాడు సాయి తేజ్. మెసేజ్ ఒరియెంటెడ్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక మళ్లీ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు.ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. అక్షరాల వెనుక ఉన్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం అంటూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. పజిల్ ను డీకోడ్ చేయండి అంటూ ఆడియెన్స్ కు టాస్క్ ఇచ్చారు మేకర్స్. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి ఆ పజిల్ అర్థం ఏంటో చిత్రయూనిట్ మరో అప్ డేట్ తో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
అక్షరాల వెనకున్న అంకెలు,
ఆ అంకెలే కథకు ఆరంభం…Let’s start decoding this puzzle !!!
WHAT COULD IT BE?
STAY TUNED.#Virupaksha #VirupakshaonApr21st pic.twitter.com/tXr8EjWC2o— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 14, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: