ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కు రెండు వారాలు మాత్రమే ఉంది.. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను లక్నోలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈనేపథ్యంలో అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘చిత్తు చిత్తుల గుమ్మ’ అంటూ బతుకమ్మ పాటతో ప్రారంభం అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నా లాంటి అమ్మాయి దొరికిందంటే ధరణిగా పెట్టి పుట్టావురా నాకొడకా అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అలానే ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్ రాల్తయ్ బాంచెత్ అంటూా నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలుస్తున్నాయి. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా నాని పెర్ఫామెన్స్, డైలాగ్స్, మాస్ స్టైల్ ఎంతో బాగుంది. కీర్తి సురేష్ డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి.
#DASARA T-R-A-I-L-E-R
Nee Yavvaa .. 🪓♥️https://t.co/UXWGlnRq6iMarch 30th 🔥#EtlayitheGatlayeSuskundham #DasaraTrailer pic.twitter.com/Be8LlJtnMg
— Nani (@NameisNani) March 14, 2023
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: