పవన్-సుజీత్ మూవీ షూటింగ్ అప్ డేట్

Pawan Kalyan And Sujeeth Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies Songs 2023,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pawan Kalyan And Sujeeth,Pawan Kalyan And Sujeeth Movie,Pawan Kalyan And Sujeeth Movie Update,Pawan Kalyan And Sujeeth Movie Shooting,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Sujeeth,Director Sujeeth,Sujeeth Movies,Pawan Kalyan And Sujeeth Movie Shooting Latest Update,Pawan Kalyan And Sujeeth Movie Shooting News,Pawan Kalyan New Films Shooting Updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు రాజకీయాలు.. ఇటు వరుస సినిమాలతో క్షణం లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పటికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోన్నాడు. మొఘ‌లుల కాలం నాటి క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అంతేకాదు సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. ఇప్పటికే తన పోర్షన్ కు సంబంధించిన షూట్ ను దాదాపు పూర్తి చేశారు. మిగిలిన చిన్న పోర్షన్ ను వచ్చే నెలలో పూర్తి చేయనున్నాడు. ఇంకా గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేయ‌బోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలతో పాటు సుజీత్ కూడా మరో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. సాహో త‌ర్వాత సుజీత్ తెర‌కెక్కిస్తోన్న సినిమా అందులో పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటివరకూ సుజీత్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉండగా.. అది పూర్తవ్వడంతో ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కు డేట్ ఫైనలైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసినిమా జపాన్ ఇంకా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు.. ఈనేపథ్యంలో ముందు ముంబై పార్ట్ కు సంబంధించి షూట్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మరి చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 15 =