సూపర్ హిట్ ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ కు, బ్లాక్ బస్టర్ విన్నై తాండి వరువాయా మూవీలో అతిథి పాత్రలో నటించి సమంత కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సమంత అనారోగ్యానికి గురి కావడం, కోలుకొన్న తరువాత సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో గాయాలు అవ్వడంతో సమంత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని భావించారు. సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనలో పయనిస్తున్నారు. గతంలో కూడా సమంత మానసిక ప్రశాంతత కోసం దేశం లోనే ప్రముఖ దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడులోని ఓ ప్రముఖ దేవాలయంలో మొక్కులు కూడా చెల్లించారు. తాజాగా ఆధ్యాత్మిక చింతనలో భాగంగా తన నివాసంలోని అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్న సమంత.. జీవితంలో నమ్మకమే ప్రధాన బలం.. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుందనీ, నమ్మకమే మీ గురువు, నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా మార్చుతుందనీ అంటూ సమంత పూజ చేస్తున్న తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: