దసరా ట్రైలర్ రిలీజ్ వేదిక ఖరారు

Nani Dasara Movie Trailer Launch Event Venue Fixed

న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందిపాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ ను ఆదిశగానే భారీగానే చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మార్చి 14వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ వేదికను కూడా ఖరారు చేశారు. ఈవిషయాన్ని కూడా చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని లక్నో లోని ప్రతిభ థియేటర్ లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి గ్రాండ్ గా జరుపనున్నట్లు తెలిపారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =