ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ ను అద్భుతంగా పరిచయం చేసిన దీపికా పడుకొనే

Deepika Padukone Introduces Naatu Naatu Song From RRR On Oscars 2023 Stage

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈమూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుని 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఒక ప్రెజెంటర్ గా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ ను అద్భుతంగా పరిచయం చేశారు. నాటు నాటు సాంగ్ ఒక ముఖ్యమైన సన్నివేశం లో వచ్చిందనీ.. ఈ సినిమా స్నేహం ఆధారంగా, ముఖ్యంగా ఇద్దరు రియల్ లైఫ్ వ్యక్తులు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య నడిచిందనీ.. ఈ పాటవలసవాద వ్యతిరేక ఉద్యమానికి నాందిగా ఉర్రూతలూగించిందనీ, ఈ పాట మిలియన్స్ కొద్దీ వ్యూస్ సాధించిందనీ, ఈ పాటకి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేచి డాన్స్ చేశారు కూడా అనీ, అలాగే ఇది మొదటి ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి పాట అనీ, నాటు అంటే మీకు తెలుసా అనీ, ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారనీ, ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి నాటు నాటు పాట చూస్తూ వింటారనీ చెప్పడంతో హాలు హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =