లియో సెట్ లో అడుగుపెట్టిన సంజూ భాయ్

sanjay dutt joins in leo movie shooting

ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న డైరెక్టర్ మిస్కిన్ తన పార్ట్ కు సంబంధించిన పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు ఆయన సెట్ కు అడుగుపెట్టారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. నేటి నుండి ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈవీడియో ను మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =