న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక వరుసగా పాటలను కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ ను చేయనున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 14వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: