టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా అన్న సంగతి తెలిసిందే కదా. మొదటి సినిమాకే తను దర్శకత్వం వహించి అలానే హీరోగా కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టాడు విశ్వక్ సేన్. తనే హీరోగా ఇంకా దర్శకత్వం వహిస్తూ వస్తున్న సినిమా ధమ్కీ. విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రంగా ధమ్కీ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ 1.0 ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ 2.0 సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ధమ్కీ 2.0 ట్రైలర్ ని మార్చి 12న కరీంనగర్ లోని మార్క్ఫెడ్ గ్రౌండ్, రామ్ నగర్ లో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ విశ్వక్ సేన్ క్లాస్, మాస్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.
కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: