తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ బ్లాక్ బస్టర్ ధడక్ మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ , రూహి, గుడ్ లాక్ జెర్రీ, మిలి వంటి మూవీస్ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ కథానాయికగా తెరకెక్కిన బవాల్మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ ప్రస్తుతం Mr &Mrs మహి మూవీలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ జాన్వీ కపూర్ #NTR30 మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR 30 మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ ఎంపిక అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జాన్వీ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ తన బ్లాక్ &వైట్ ఫొటో ను షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































